పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ
19-10-2026 | 09:29pm
పటాన్ చెరు: ముత్తంగి డివిజన్‌లో 200 మందికి పైగా పారిశుధ్య కార్మికులకు మరియు ఇతరులకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శాపురం నర్సింహారెడ్డి(Congress Leader Narasimha Reddy) దసరా పండుగ(Dasara) సందర్భంగా చీరలు, గొడుగులు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్తంగి డివిజన్ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.