జనసేన పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభం

19-10-2026 | 10:10pm

భూత్పూర్, అక్టోబర్ 19: జనసేన పార్టీ(Janasena Party) దేవరకద్ర నియోజకవర్గ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర నాయకులు గుడిబండ రవి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా కో ఆర్డినేటర్ మేడ రామకృష్ణ  ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గుడిబండ రవి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని అన్నారు.

ప్రజల సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు అండగా నిలవడమే పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, యువతను, ప్రజలను పార్టీ కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి బైరపోగు సాంబశివుడు, గద్వాల జిల్లా నాయకులు గట్టు తిమ్మప్ప, మక్తల్ నియోజకవర్గ నాయకులు మణికంఠ గౌడ్, మహబూబ్నగర్ జిల్లా నాయకులు pr రాఘవేంద్ర, వీర మహిళలు శ్రీవల్లి, కనకదుర్గ, నవనీత, అనిత చారి,మునైః, బలరాజ్, రవి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు