5 September, 2026 | 1:16 PM

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

05-09-2026 | 12:14pm

సింగాటంలో ‘గడప గడపకు బాకీ కార్డు’ పంపిణీ

గజ్వేల్, సెప్టెంబర్ 5: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్(Bharat Rashtra Samithi) చేపట్టిన వారం రోజుల ఉద్యమంలో భాగంగా గజ్వేల్ మండలంలోని సింగాటం గ్రామంలో ‘రేవంత్ సర్కార్ బాకీ పడ్డ–గడప గడపకు బాకీ కార్డు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల బీఆర్‌ఎస్(BRS) అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెండే మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం, ఎకరాకు రూ.15 వేల రైతుబంధు, రైతు బీమా, మహిళలకు నెలకు రూ.2,500, స్కూటీలు వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

రైతులకు 24 గంటల విద్యుత్ విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని, యూరియా(Urea) కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తాటికొండ మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అందాలు మల్లేశం, ములుగు మల్లేశం, ఏర్ల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ షాదుల్, గున్నల కృష్ణారెడ్డి, పంజా రాజమల్లు, నాంపల్లి కరుణాకర్, కీసర నరేష్ గౌడ్, జయపాల్ రెడ్డి, కుంట నరేష్, సాగర్ గౌడ్, వార్డు సభ్యులు కేసరి లింగ గౌడ్, పూదురు ప్రభాకర్, బొంది స్వామి, మాన్నే రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు