మృతుని కుటుంబానికి రూ.33,500 సాయం

20-09-2026 | 05:16pm

గజ్వేల్, సెప్టెంబర్ 20: ఇటీవల మృతి చెందిన విశ్వకర్మ వడ్లకొండ కమలాచారి కుటుంబానికి విశ్వకర్మ మనుమయ సంఘం (Vishwakarma Manumaya Sangha)ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. కమలాచారి  కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుసుకున్న సంఘం సభ్యులు స్పందించి రూ.33,500 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ సంఘం నాయకులు పేరుపేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గడియారం వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి ముత్యాల విఠలాచారి, నాయకులు వెంకటేష్ చారి, లక్ష్మీ నరసింహచారి, స్వామి చారి, శ్రీనివాస్ చారి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు