డివైడర్‌ను ఢీకొని భార్యాభర్తలు మృతి

03-11-2026 | 11:38am

సంగారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పరిధిలో సోమవారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో (Road Accident) ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా శంకర్‌పల్లి మండలం గాజులగూడెం గ్రామానికి చెందిన ఎల్లకొండ నర్సింలు (40), ఆయన భార్య మౌనిక (33) కారులో శంకర్‌పల్లి నుంచి సంగారెడ్డి వైపు ప్రయాణిస్తున్నారు. కంది గ్రామానికి చేరుకోగానే డ్రైవర్ అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు బోల్తా పడటంతో (Car Collision) భార్యాభర్తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (Police Investigation) కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు