విజయవాడలో వర్షం.. ఎన్నికల కౌంటింగ్‌పై ఎఫెక్ట్!
03-11-2026 | 08:09am
విజయవాడ: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తుఫాన్ ప్రభావం పడింది. విజయవాడలో భారీ వర్షం (Heavy Rain) కురుస్తుండటంతో కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇంకా పూర్తిస్థాయిలో చేరుకోలేదు.
మరోవైపు, విధులకు హాజరయ్యే సిబ్బందికి సంబంధించిన ఆర్డర్ కాపీలు (Duty Orders) ఇంకా అందలేదు. ఆర్డర్ కాపీలు అందిన తర్వాతే ఓట్ల లెక్కింపు (Vote Counting) ప్రారంభం కానుంది. దీంతో కౌంటింగ్ ప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది.