జీహెచ్ఎంసీ అధికారికి ఏసీబీ షాక్.. రెండు చోట్ల సోదాలు!

03-11-2026 | 08:41am

హైదరాబాద్: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరికి అవినీతి నిరోధక శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ (ACB) అధికారులు రంగంలోకి దిగారు.

హైదరాబాద్, సూర్యాపేటలోని యాదగిరి నివాసాల్లో ఏకకాలంలో సోదాలు (Raids) నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో లభించే ఆస్తులు, పత్రాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు