ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో టోకరా
- హయత్ నగర్ లో ఘరానా మోసం
- పోలీస్ స్టేషన్ కి చేరుకున్న బాదితులు
- తెలంగాణ వ్యాప్తంగా డబ్బులు వసూలు
ఎల్బీనగర్, సెప్టెంబర్ 21 : ఆన్ లైన్ ట్రేడింగ్(online trading) పేరుతో జనానికి టోకరా వేసిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ (Hayat Nagar Police Station) పరిధిలో వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఇబ్రహీపట్నంలో ఘరానా మోసం మరవకముందే హయత్ నగర్ లో మరో ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ డివిజన్(Hayat Nagar Division) సీఎస్ఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర అప్పా, మండల రాములు క్యూవీఎస్ఈ యాప్ ద్వారా భారీ లాభాలు ఇస్తామని ప్రచారం చేశారు. దీంతో ఒకే కాలనీ నుంచి 800 మంది బాధితులు డబ్బులు కట్టి మోసపోయారు. సుమారు రూ, 4 నుంచి రూ, 5 కోట్ల వరకు మోసం జరిగిందని ప్రాథమిక అంచనా.
QVSE ఆన్ లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే నెలకి లక్షల్లో లాభాలు వస్తాయని వెంకటేశ్వర అప్పా నమ్మించాడని, యాప్ ను పూర్తిగా క్లోజ్ చేయటం తో మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, మోసపోయిన వారు వారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీఐ శంకరయ్య చెప్పారని బాధితులు వాపోతున్నారు. మోసం చేసిన వారు హయత్ నగర్ లో ఉంటే... కేసు ఇక్కడ కాదు మీ ఏరియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వాలని వెనక్కి పంపించారని బాధితులు పేర్కొంటున్నారు. అయితే, బా ఎల్బీనగర్, నాగోల్, మీర్ పేట, చంపాపేట, షాద్ నగర్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన బాధితులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు.