సోలార్ విద్యుత్ వినియోగించుకోవాలి
- సరూర్ నగర్ ఆపరేషన్స్ డీఈఈ ఫర్హాత్ అలీ
- కొనసాగుతున్న రూఫ్‌టాప్ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు
ఎల్బీనగర్, అక్టోబర్ 2: ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో సొంతంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి, వినియోగంచుకోవడంతో పాటు ఆదాయాన్ని పొందాలని టీజీఎస్పీడీసీఎల్ సరూర్ నగర్ ఆపరేషన్స్ డీఈ ఫర్హాత్ అలీ(TGS PDCL DE Farhat Ali) సూచించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై అక్టోబర్ 2 నుంచి 4 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
శుక్రవారం సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయం, ఆటోనగర్ లోని వినియోగదారుల సేవా కేంద్రం, డీఈ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ, బ్యాంకు ఆర్థిక సహాయం, సోలార్ ఏర్పాటు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్ఈ లక్ష్మీనారాయణ, డీఈ ఆపరేషన్ ఫర్హత్ అలీ, డీఈ టెక్నికల్ రాజారాంరెడ్డి, ఏడీఈ ఐసీఎస్సీ సుజాత, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ సిన్హా, సోలార్ వెండర్లు పాల్గొన్నారు.