కరెంట్ కటకట
- హైదరాబాద్లో గంటల తరబడి అప్రకటిత కోతలు
- ఐటీ కారిడార్లో తిప్పలు
- వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగుల ఆన్లైన్ మీటింగ్లకూ బ్రేక్
అక్టోబర్ 19 (విజయ క్రాంతి): హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో(IT Corridor) అప్రకటిత కరెంట్ కోతలు ఐటీ ఉద్యోగులను తిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ అంతరాయం(Power Interruption) కారణంగా అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తున్న టెకీలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతు న్నాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచి పోవడం, పదేపదే కరెంట్ పోవడం, వైఫై రూటర్లు పనిచేయకపోవడం, మొబైల్ నెట్వర్క్(Mobile Network) సరిగా అందకపోవడం వంటి సమస్యలు రోజువారీ పనులను దెబ్బతీస్తు న్నాయని ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ కోతలు లేవని అధికారులు చెప్తుండగా.. క్షేత్రస్థాయిలో మా త్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని టెకీలు అంటున్నారు. సాధారణంగా ఉదయం కార్యాల యాల పనులు ప్రారంభమయ్యే సమ యం నుంచే విద్యుత్ అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం రోజంతా కొనసాగుతుంది. ఉదయం ప్రారంభిం చాల్సిన ప్రాజెక్టు పనులు ఆలస్యమవ డం, ఆన్లైన్ సమావేశాలకు హాజరుకాలేకపో వ డం, విదేశీ క్లయింట్లతో నిర్వహించే చర్చలు మధ్య లోనే నిలిచి పోవడం వంటి సమస్యలు ఎదురవు తున్నాయి. సాయంత్రానికి విద్యుత్ సరఫరా పున రుద్ధరించినా, అప్పటికే కోల్పోయిన పని సమ యాన్ని తిరిగి పొందడం ఉద్యోగులకు సవాలుగా మారుతున్నది.
ఆ ప్రాంతాల్లో ఫిర్యాదులు
ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వైఫై రూ టర్ పనిచేయడం ఆగిపోవడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ బలహీనం గా ఉండటం లేదా నెట్వర్క్ ఆధారిత ప్రత్యామ్నా య కనెక్షన్ సరిగా పనిచేయకపోవడంతో ఉద్యోగు లు ఆన్లైన్లోకి రావడం కష్టమవుతున్నది. ల్యాప్టా ప్లో బ్యాటరీ బ్యాకప్ ఉన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే పని కొనసాగించడం సాధ్యం కావడం లేదు. విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొ నేందుకు వ్యక్తిగతంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నా.. అవి అన్ని సందర్భాల్లో ఉపయో గపడటం లేదని ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు.
మాదాపూర్తోపాటు గచ్చిబౌలి, కూకట్పల్లి, కొం డాపూర్, మణికొండ ప్రాంతాల్లోనూ విద్యుత్ కోత లపై టెకీలు ఫిర్యాదు లు చేస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్లో ఐటీ సంస్థల విస్తరణ, కొత్త పెట్టు బడులు, ఉద్యోగ అవకా శాల పెంపుపై చర్చ జరు గుతుంటే.. మరోవైపు అదే రంగానికి అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాల విషయంలో ఫిర్యాదులు రావడం ఆందోళన కలిగిస్తున్నది.
భారీగా విద్యుత్ డిమాండ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాం డ్ 4 వేల మెగావాట్లకు పైగా ఉం టున్నది. గృహా లు, వాణిజ్య సముదా యాలు, ఐటీ సంస్థలు, పరిశ్రమ లు, ఆసుపత్రులు, ఇతర సేవా రంగాల అవస రాలు కలిపి నగరంలో విద్యుత్ వినియో గం గణనీయంగా ఉంది. ఇంతటి డిమాం డ్కు తగ్గట్టు విద్యుత్ సరఫ రా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించడం, పంపిణీ నెట్వర్క్ను ఆధునీకరిం చడం, అవసరమై న చోట సామర్థ్యాన్ని పెంచడం కీలకంగా మారింది. విద్యుత్ అంతరాయాల కార ణంగా ఉద్యోగులు కోల్పోయిన పని సమయాన్ని తిరిగి భర్తీ చేసేందుకు అదనపు గంటలు పనిచే యాల్సి రావచ్చు.
గడువులు దగ్గరప డినప్పుడు పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తిపరమైన పనులను సమ న్వయం చేసుకోవాల్సిన వర్క్ ఫ్రం హోమ్ ఉద్యో గులకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారు తుంది. ప్రత్యా మ్నాయంగా కార్యాలయానికి వెళ్లా ల్సి వస్తే ప్రయాణ సమయం, రవాణా ఖర్చు లు పెరుగుతాయి. ఇలా విద్యుత్ అంత రాయం ఒక చిన్న సాంకేతిక సమస్యగా ప్రారంభమైనా, దాని ప్రభావం ఉద్యోగు ల సమయం, ఖర్చులు, పనుల ప్రణాళికపై పడుతుంది.
ఫిర్యాదులకు స్పందన కరువు!
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎదురైన ప్పుడు వినియోగదారులు సంబంధిత అధికారుల కు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, ఫిర్యాదులు చేసి నా సమస్య పరిష్కారం కావడం లేదని కొందరు ఐటీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఎప్పు డు వస్తుందో తెలియక పనులను నిలిపివేయాల్సి వస్తు న్నదని చెప్తున్నారు. సమస్యను వివరించినా పరిష్కా రానికి బదులుగా ఏఐ ఆధారిత సమాధా నాలు మాత్రమే వస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, సాం కేతిక సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతు న్నాయని, వాటిని గుర్తించి పునరుద్ధరిస్తున్నామని విద్యుత్ అధికారులు ప్రకటించారు. అయితే హైద రాబాద్లోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్లు వినియోగ దారులు ఫిర్యా దు చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారుల అధికారిక ప్రకటనలకు, క్షేత్రస్థాయి అనుభవా లకు మధ్య వ్యత్యాసం ఉందన్న విమర్శ లు వినిపిస్తున్నాయి.
ఇక్కడ విద్యుత్ కోతలు, సాంకేతిక అంతరాయాల మధ్య తేడాను కూడా స్పష్టం గా వివరించాల్సిన అవసరం ఉంది. ముందస్తు ప్రకటనతో నిర్వహణ పనుల కోసం సరఫరా నిలిపివేయడం, సాంకేతికలో పంతో అనూహ్యం గా విద్యుత్ నిలిచిపోవడం వంటి అంశాలకు కార ణాలు, పరిష్కార విధా నాలు వేర్వేరుగా ఉంటా యి. కానీ వినియో గదారుడి కోణంలో చూస్తే విద్యుత్ లేకపో వడం వల్ల కలిగే ఇబ్బందే ప్రధాన సమస్య. అందువల్ల అంతరా యాన్ని ఏ పేరుతో పిలుస్తున్నామన్నదా నికంటే అది ఎందుకు ఏర్ప డింది, ఎంతసేపు కొనసాగింది, పునరా వృతం కాకుండా ఏ చర్యలు తీసుకున్నార న్నది ముఖ్య మని ఐటీ ఉద్యోగులు అంటున్నారు.
హైదరాబా ద్ ఐటీ రంగం దేశీయంగానే కాకుండా అంత ర్జాతీయంగా కూడా కీలక స్థా నాన్ని సంపా దిం చిందని.. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు, అంత ర్జాతీయ క్లయింట్లకు సేవలు, రాత్రింబవళ్లు కొన సాగాల్సిన సాంకేతిక కార్యకలాపాలు ఈ రంగంలో సాధారణ మని.. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫ రాలో అనిశ్చితి తమ పనితీరును ప్రభావితం చేస్తు న్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటనలు ఓకే.. పరిష్కారమేదీ?
హైదరాబాద్లో విద్యుత్ అంతరాయాల సమ స్యను పరిష్కరించాలంటే తాత్కాలిక మరమ్మతుల తో పాటు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. తరచూ ఫీడర్లు ట్రిప్ అవుతున్న ప్రాంతాలను గుర్తించి వా టి సామర్థ్యాన్ని సమీక్షించాలని.. డీటీఆర్లపై పడు తున్న భారం, కేబుళ్ల పరిస్థితి, పంపిణీ వ్యవస్థలోని బలహీనతలను పరిశీలించాలని వినియోగ దారు లు అంటున్నారు.
అవసరమైన చోట అదనపు సామర్థ్యం కల్పించడం, పాత పరిక రాలను మార్చడం, ముందస్తు నిర్వహణ చేపట్టడం ద్వారా అం త రాయాలను తగ్గించవ చ్చని గుర్తుచేస్తున్నారు. ని ర్వ హణ పనుల కోసం విద్యుత్ నిలిపివేయాల్సి వస్తే తమకు ముందుగా సమాచారం ఇవ్వడం లేద ని వినియోగదారుల నుం చి ఫిర్యాదులు ఉన్నా యి. ప్రకటనలకే విద్యుత్ అధి కారులు పరిమి తమవు తున్నారని, పరిష్కారం స రిగా చూపడం లేదని ము ఖ్యంగా ఐటీ కారిడార్లోని టెకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.