గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు
ఎల్బీనగర్, అక్టోబర్ 4 : లెక్చరర్స్ కాలనీ డివిజన్లోని(Lecturers' Colony Division) వెంకటేశ్వర కాలనీ ప్రముఖ ప్లాజా అపార్ట్మెంట్లో శ్రీ సామ దామోదర్ రెడ్డి(Sri Sama Damodar Reddy) గారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని(Graduate MLC Voter Registration Program) ఆదివారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి గారు, శ్రీ కోప్పుల నర్సింహ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొని తమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగంచేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీను, హై కోర్ట్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు మధు సుధన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.