భారతీయ యోగ సంస్థాన్ 60వ యోగా దివస్
ఎల్బీనగర్, అక్టోబర్ 4 : భారతీయ యోగా సంస్థాన్(Bharatiya Yoga Sansthan) 60వ యోగా దివస్ వేడుకలను జిల్లా అధ్యక్షుడు వందనపు మధు, ప్రధాన కార్యదర్శి పి.రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ లోని కాస్మోపాలిటన్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ యోగా సంస్థాన్ తెలంగాణ రాష్ట్ర (తూర్పు ) అధ్యక్షుడు సుధీర్ కులకర్ణి(Sudhir Kulkarni) అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి, సంస్థాన్ కార్యదర్శి సదానంద చారి, కాస్మోపాలిటన్ కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు రుద్ర లక్ష్మీనరసింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఇతర అధికారులు 550 మందికి పైగ సాధకులు పాల్గొని యోగా ఆసనాలు, ప్రాణమయం, ధ్యానం చేశారు. మంగ ఆధ్వర్యంలో యోగా సాధికలు చేసిన యోగ నృత్య ప్రదర్శన విశేషంగా అందరినీ ఆకట్టుకుంది.