గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

17-10-2026 | 03:33pm

– సర్పంచ్ జుట్టు శేఖర్

ఇల్లంతకుంట: అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని సర్పంచ్ జుట్టు శేఖర్ ఆకాంక్షించారు. శనివారం ఇల్లంతకుంట మండలం(Illanthakunta mandal)లోని పత్తికుంటపల్లెలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యుల తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.

నవరాత్రి ఉత్సవాలు(Navaratri Utsavams) భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీక లని, గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఉండి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలనీ కోరారు.ఉప సర్పంచ్ మనోహర్ రెడ్డి, జుట్టు రమేష్,పి. మహేందర్, నరేష్, సురేష్, మధుసూదన్, నవీన్,అమన్, విహాన్, రుత్విక్ ,సాయిచరణ్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు