ప్రమాదకర విద్యుత్ తీగల సమస్య పరిష్కారానికి సర్పంచ్ చొరవ
ప్రజా భద్రతే ప్రథమ లక్ష్యం
సర్పంచ్ జిన్న అనూష అనిల్ కుమార్
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామం(Palli Maktha Village)లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ జిన్న అనూష అనిల్ కుమార్(Sarpanch Jinna Anusha Anil Kumar) చొరవ చూపారు. గ్రామంలో విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటాన్ని గుర్తించి, ఈ సమస్యను సంబంధిత విద్యుత్ శాఖ(Electricity Department) అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రమాదాల నివారణకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి సహకరించిన విద్యుత్ శాఖ ఏఈతో పాటు లైన్మెన్లకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రజా భద్రతే ప్రథమ లక్ష్యంగా, గ్రామ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఛిద్రవేణి నరేష్, జిన్న సమత అర్జున్, లైన్మెన్ శ్రీనివాస్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.