నిరుపేద జర్నలిస్ట్ కుటుంబానికి అండగా నిత్యవసర సరుకుల పంపిణీ

04-10-2026 | 02:43pm

గంభీరావుపేట, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామానికి చెందిన ఏడబోయిన నారాయణ (ఆర్‌ఎంపి), జర్నలిస్ట్‌గా సేవలందిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.. నిరుపేద కుటుంబంగా ఉండటంతో వారికి అండగా తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల కన్వీనర్ కూర సురేష్ సుమారు రూ.6 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్, జర్నలిస్టులు రమేష్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు