శర్వానంద్ మాస్ అవతారం.. ‘భోగి’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

04-10-2026 | 02:44pm

శర్వానంద్.. ఇప్పటివరకు విభిన్న కథలు, క్లాస్ టచ్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన హీరో. కానీ ఈసారి ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. పూర్తిస్థాయి మాస్ యాక్షన్ అవతారంలో ‘భోగి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన Bhogi Teaser సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. దర్శకుడు సంపత్ నంది మార్క్ కనిపించేలా టీజర్‌ను యాక్షన్, ఎమోషన్, పల్లెటూరి వాతావరణంతో నింపేశారు. ముఖ్యంగా శర్వానంద్ లుక్ ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. గడ్డంతో, రఫ్‌గా కనిపిస్తూ.. కళ్లలో కోపం, మాటల్లో దూకుడు చూపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

1960ల తెలంగాణలోకి తీసుకెళ్లిన ‘భోగి’

Bhogi Movie కథ 1960ల కాలం నాటి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామం చుట్టూ తిరుగుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అప్పటి గ్రామీణ సమాజంలో బలంగా ఉన్న భూస్వామ్య వ్యవస్థ, పెత్తందారుల ఆధిపత్యం, అణచివేత, హింస వంటి అంశాలను కథలో కీలకంగా చూపించినట్లు తెలుస్తోంది. ఇక్కడే శర్వానంద్ పోషిస్తున్న ‘కమ్మరి గంగ’ పాత్ర ఆసక్తిని పెంచుతోంది. వృత్తిరీత్యా కమ్మరి అయిన గంగ.. సాధారణ వ్యక్తిగా కనిపించినా, గ్రామంపై పెత్తనం చెలాయించే శక్తులను ఎదిరించే వ్యక్తిగా టీజర్‌లో కనిపించాడు. అతడి చుట్టూ జరిగే పరిణామాలు, తిరుగుబాటు స్వభావం సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశముంది.

మట్టి వాసనతో పాటు యాక్షన్ డోస్

గ్రామస్తుల కష్టాలు, పెత్తందారుల దౌర్జన్యాలు, పోలీసులతో ఘర్షణలు, అణచివేతకు వ్యతిరేకంగా గంగ చేసే పోరాటం.. ఇలా Sharwanand Bhogi టీజర్‌లో ప్రతి సన్నివేశం సినిమాకు ఓ ప్రత్యేక మూడ్‌ను తీసుకొచ్చింది. మరోవైపు యాక్షన్ సన్నివేశాలను కూడా దర్శకుడు సంపత్ నంది తనదైన శైలిలో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. మట్టి వాసన కనిపించే గ్రామీణ దృశ్యాలకు తోడు తీవ్రమైన పోరాట ఘట్టాలను జోడించడం Bhogi movie teaserకు మరింత బలాన్ని ఇచ్చింది.

శర్వాకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు

ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. టీజర్‌లో వినిపించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాల తీవ్రతను మరింత పెంచింది. Bhogi Release Date విషయానికి వస్తే.. ఈ సినిమాను నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు క్లాస్, వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన శర్వానంద్.. ‘కమ్మరి గంగ’గా ఎంతవరకు మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి. అయితే ‘భోగి’ టీజర్ మాత్రం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.



మరిన్ని వార్తలు