స్వచ్ఛతలో మేము సైతం

02-10-2026 | 02:31pm

బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి 

ముస్తాబాద్,అక్టోబర్ 02( విజయక్రాంతి ): మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో సుదీర్ఘమైన,నిస్వార్థ  ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని,కేంద్ర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “సేవా సంకల్ప అభియాన్”(Seva Sankalp Abhiyan) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం స్థానిక పోలీస్ స్టేషన్ లో బిజెపి మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు.

క్రాంతి కుమార్ స్వయంగా చీపురు పట్టి పోలీస్ స్టేషన్ ఆవరణలో శుభ్రం చేసి, కార్యకర్తలకు,ప్రజలకు సేవా స్ఫూర్తిని చాటారు.ఈ క్రాంతి సందర్భంగా మాట్లాడుతూ:  అధికారం అంటే హోదా కాదు..అదొక బాధ్యతని ప్రధాని మోదీ గత 25 ఏళ్లుగా ప్రజలకు సేవలు అందించడమే ఒక ఉదాహరణ అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు జనవాస పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ప్రతి వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన బహుమతి.” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ అంజగౌడ్,ప్రధాన కార్యదర్శులు గోపి మహేశ్వరి,మండల ఉపాధ్యక్షుడు తిరుపతి, పోతుగల్ ఉప సర్పంచ్ కోల కృష్ణ,వార్డు  వేణుగోపాల్,నరేష్,శక్తి కేంద్ర ఇంచార్జీలు వెంకటేష్, వెంకన్న,మహేష్,సీనియర్ నాయకులు శ్రీనివాస రావు, యాదగిరి,వినయ్,హరీష్,నర్సింలు,అజయ్,అజయ్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు