సుల్తానాబాద్ సింగిల్ విండో అగ్రస్థానం

27-10-2026 | 12:06pm

79 మార్కులతో రికార్డు

ప్రతిభ ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానాబాద్ సహకార సంఘం

సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సంఘ సీఈవో బూర్గు సంతోష్ 

సుల్తానాబాద్, అక్టోబర్ 27 (విజయ కాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో విస్తరించి ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు పై నిర్వహించిన మూల్యాంకనంలో పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ సింగిల్ విండో  79 మార్కులు సాధించి, ఉమ్మడి జిల్లాలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచిందని సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సంఘ సీఈవో బూర్గు సంతోష్ , పాలకవర్గం స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో రుణాలు అందించడం, ఎరువుల విత్తనాల సరఫరాను సమర్థవంతంగా నిర్వహించడం, ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడం, వ్యాపార వైవిధ్యీకరణ, రుణాలు తిరిగి రాబట్టడంలో ప్రతిభ చూపడంతో పాటు, డిజిటలైజేషన్  ఉత్తమ నిర్వహణ ప్రమాణాలు పాటించినందుకు గాను సుల్తానాబాద్ ప్యాక్స్‌కు ఈ 79 మార్కులు దక్కడం పని తీరుకు నిదర్శనం అన్నారు.

ఈ సందర్భంగా శ్రీగిరి శ్రీనివాస్ , బూరుగు సంతోష్   మాట్లాడుతూఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్యాక్స్‌ల కంటే మన సుల్తానాబాద్ ప్యాక్స్ 79 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. రైతు సోదరుల నమ్మకం, పాలక వర్గ సభ్యుల సహకారం, సంఘ సిబ్బంది నిరంతర శ్రమ వల్లే ఈ గుర్తింపుసాధ్యమైందన్నారు. మున్ముందు  రైతులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ విజయం పట్ల సంఘ సభ్యులు, స్థానిక రైతులు, పాలకవర్గం సంతోషం వ్యక్తం చేశారు. సంఘం అభివృద్ధికి సహకరించిన అధికారులకు సిబ్బందికి, రైతు సోదరులకు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సంఘ కార్యదర్శి బూర్గు సంతోష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుల్తానాబాద్ సహకార సంఘానికి మరింత గుర్తింపు రావడం పట్ల సంఘ పరిధిలోని పలువురు రైతులు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు