మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ రఫీక్‌కు ఘన సన్మానం
ఆసిఫాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ ఉపాధ్యక్షుడు ఎంఏ రఫీక్‌ను(Minority Vice-President M.A. Rafiq) మున్సిపల్ కౌన్సిలర్లు, మండల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు, పార్టీకి సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అసిఫ్ అలీ, గులాం జవీద్, సర్పంచులు బసవయ్య, వినోద్, కౌన్సిలర్లు రాపర్తి కార్తీక్, జాడి వినోద్, మేకర్తి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దత్తు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్‌కే అసద్, అబ్దుల్లా, రాజేందర్, నిఖిల్, కొండు సాయి, ప్రవీణ్, మహేష్, మిట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.