లారీ బోల్తా... డ్రైవర్ క్లీనర్ కు గాయాలు..
27-10-2026 | 03:45pm
ఉట్నూర్, అక్టోబర్ 27( విజయక్రాంతి ): ఇంద్రవెల్లి మండలంలోని గలియా భాయ్ గ్రామంలోని(Galia Bhai Village) ప్రధాన రహదారిపై పత్తి గింజల లోడు ను ఆదిలాబాద్ కు తీసుకు వెళ్తుండగా లారీ బోల్తా పడింది. మంగళవారం వరంగల్ నుండి అదిలాబాద్ జిల్లా కేంద్రానికి పత్తి గింజల రోడ్డుతో వస్తున్న లారీ రోడ్డుపై మిషన్ భగీరథ పైప్ లైన్(Mission Bhagiratha Pipeline) కొరకు తవ్విన రోడ్డు వద్ద లారీ బోల్తా పడడంతో లారీ డ్రైవర్, క్లీనర్ కు గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయాలైన ఇద్దరినీ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.