సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
రామగిరి,(విజయక్రాంతి): రామగిరి సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం(Right to Information Act Foundation Day) సందర్భంగా రామగిరి మండలం నాగేపల్లి గ్రామం(Nagapalli village)లో మొక్కలు నాటడంతో పాటు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, సిబ్బందిని సన్మానించారు. సమాచార హక్కు చట్ట సాధన కమిటీ పెద్దపల్లి జిల్లా(Peddapalli District) అధ్యక్షుడు పాండ్రాల రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్ యాదవ్, ఉప సర్పంచ్ యాసం సతీష్, పంచాయతీ కార్యదర్శి పాదం స్వప్న, ఏఎన్‌ఎం రాణి, ఆశా కార్యకర్త తులసిని శాలువాలతో సత్కరించారు. సమాజంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించడం, ప్రజలకు తమ హక్కుల గురించి తెలియజేయడం, పారదర్శకతను ప్రోత్సహించడం లక్ష్యంగా కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాసేవలో భాగస్వాములవుతున్న గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, సిబ్బందిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ తోగరి సురేష్, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కొమురోజు సురేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేగోలపు సురేష్, జిల్లా అధికార ప్రతినిధి కాశిపేట శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు యాసం శ్రావణ్, ఆర్ల సనిల్, జిల్లా కార్యదర్శి బూడిద అనిల్, జిల్లా కో-కన్వీనర్ మిట్ట సాయి పాల్గొన్నారు. మంథని నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రామడుగు శ్రీనివాస్, ఇన్‌చార్జ్ సాయి చరణ్, ఉపాధ్యక్షుడు బూడిద రాజు, రామగుండం డివిజన్ ఉపాధ్యక్షుడు పెద్దపల్లి రామచందర్, మంథని డివిజన్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఎల్పుల సామ్రాట్ తదితరులు హాజరయ్యారు.