ఉచిత కంటి పరీక్షల శిబిరంకు స్పందన

13-10-2026 | 12:28am

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎర్త్ ఫౌండేషన్ఆధ్వర్యంలో, వాసన్ ఐ కేర్ హాస్పిటల్(Vasan Eye Care Hospital) సహకారంతో సోమవారం  సుల్తానాబాద్ లో ఎర్త్ ఫౌండేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌(Earth Foundation Training and Research Centre)లో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించగా స్పందన లభించింది. ఈ శిబిరంలో మొత్తం 120 మంది పెద్దలు, పిల్లలు పాల్గొని కంటి పరీక్షలుచేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ అమిశెట్టి శ్రావణి మాట్లాడుతూ... ఎర్త్ ఫౌండేషన్ ద్వారా మహిళలు, యువత ఆర్థికంగా స్వావలంబన సాధించేలా టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్, కర్రసాము వంటి వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంఅభినందనీయమని అన్నారు.

మహిళలకునైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.ఎర్త్ ఫౌండేషన్ కో-ఫౌండర్ కలవేణి శ్రీనివాస్  మాట్లాడుతూ పిల్లల అభివృద్ధే దేశ అభివృద్ధి అనే లక్ష్యంతో 2012 నుంచి ఎర్త్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్య, కళలు, ఆరోగ్యం వంటి రంగాల్లో సేవలందిస్తోందని తెలిపారు.

దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరి ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరమని, అందుకోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వివిధ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు.అదేవిధంగా, ప్రతి మనిషి జీవితంలో కంటి చూపు ఎంతో కీలకమని, కంటి సమస్యలతో ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో ఈ ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అమిరీశెట్టి తిరుపతి, ఎర్త్ ఫౌండేషన్ డైరెక్టర్ వెన్నెల, సెంటర్ ఇన్‌చార్జి బుచ్చిబాబు, కోఆర్డినేటర్లు రాజు, శ్రీధర, లత, అరుణ, సంధ్య పాల్గొన్నారు....

మరిన్ని వార్తలు