ఫార్మసీ విద్య ఔషధాల తయారీ, పంపిణీకి మాత్రమే పరిమితం కాదు

13-10-2026 | 12:32am

రిహెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సహ-వ్యవస్థాపకులు సీఈఓ డాక్టర్ రఘువీర్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఫార్మసీ విద్య(Pharmacy Education) అనేది ఔషధాల తయారీ లేదా పంపిణీకి మాత్రమే పరిమితం కాదని, రోగి ఆరోగ్యం, ఔషధాల సురక్షిత వినియోగం, నాణ్యత, సమాజ శ్రేయస్సుతో ముడిపడిన విస్తృత రంగమని రిహెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్(Rihet Healthcare Private Limited) సహ-వ్యవస్థాపకులు సీఈఓ డాక్టర్ రఘువీర్ పేర్కొన్నారు. ఘట్‌కేసర్ డివిజన్ కొండాపూర్ లోని సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో 21వ ఓరియంటేషన్ డే కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రిహెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సహ-వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్ రఘువీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు, నైతిక విలువలు, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కార్యదర్శి ఎం. రాజేంద్ర కృష్ణ మాట్లాడుతూ కళాశాలలో లభించే విద్యా, ప్రయోగశాల మార్గదర్శకత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, సమర్థులైన ఫార్మసీ నిపుణులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె. శివకేశవ రెడ్డి, సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. జానకి రాములు, విభాగాధిపతులు డి. స్వాతి, వి. ఉమారాణి, పి. మునిజా, పి. లక్ష్మి, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. నూతన విద్యార్థులకు కళాశాల విద్యా వాతావరణం, ఫార్మసీ రంగంలోని అవకాశాలు, వృత్తిపరమైన బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు