కళాసేవ ప్రతిభ అవార్డు -2026 అందుకున్న ధనుంజయ నాయుడు

13-10-2026 | 12:15am

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) నేరేడుచర్ల వాసి, సామాజిక కార్యకర్త, ప్రజా కళాకారుడు, బీసీ ఉద్యమకారుడు, వామపక్ష ఉద్యమ నేత  ధూళిపాళ ధనుంజయ నాయుడు కు కళాసేవ ప్రతిభ అవార్డు 2026(Kalaseva Pratibha Award 2026)ను అందజేశారు. ఇటీవల హైదరాబాదులోని అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం శ్రీ ముఖి కాంప్లెక్స్ హిమాయత్ నగర్, హైదరాబాద్ ను ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్(Aluri Cultural and Social Organization) వారి 24వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సేవ సంస్థలకు, స్వచ్ఛంద ఉద్యమకారులకు, జానపద కళాకారులకు అవార్డులు ప్రకటించి ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా ధనుంజయ నాయుడు మాట్లాడుతూ... ఈ అవార్డు అందుకోవడం పట్ల తన బాధ్యతను మరింతగా పెరిగిందని విద్యార్థులు యువకులు మహిళలు వ్యవసాయ కార్మికులు(Agricultural workers), రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు దేశ జనాభాలో 61 శాతం ఉన్న బీసీలకు జరుగుతున్న వివక్షత పట్ల మరింతగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తానని దేశానికి వెన్నుముకైన కర్షకులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ,పట్టణ కార్మికులపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల పట్ల మరింతగా పోరాడతామన్నారు.

ధనుంజయ నాయుడుకు అవార్డు రావడం పట్ల కత్తి శ్రీనివాసరెడ్డి రావుల సత్యం ముళ్ళ జానయ్య అమరారపు పున్నయ్య చిలకరాజు శ్రీను, కొమర్రాజు వెంకట్ పరికె భరత్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ముత్యాల భాస్కర్ బెల్లంకొండ గోవిందు గౌడ్ ఊదర వెంకన్న బండి శ్రీనివాస్ ఎస్కే సయ్యద్ పాషా నూతనగంటి నరసమ్మ హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు