ఫాదర్ హర్మన్ బాకర్ జన్మదినాన పచ్చదనానికి శ్రీకారం
వాటర్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ప్రతినిధులు, రైతులు
కంగ్టి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వాటర్ (WOTR) సంస్థ సహ వ్యవస్థాపకులు ఫాదర్ హర్మన్ బాకర్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా(కే) గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల(MPPS School) ప్రాంగణం ఎదుట సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఫాదర్ హర్మన్ బాకర్ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం రైతులతో కలిసి వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకొని పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఫాదర్ హర్మన్ బాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో వాటర్ సంస్థ ప్రతినిధులు, స్థానిక సర్పంచ్ శివాజీ రావు, రైతులు పాల్గొన్నారు.