పీడీఎస్ బియ్యం పట్టివేత
భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలం(Bheemini Mandal)లోని వడాల గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని(PDS Rice) సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... వడాల గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేయగా శ్రీకాంత్ ఆటోలో అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తూ పట్టుబడ్డాడని తెలిపారు. శ్రీకాంత్ ని విచారించగా కేస్లాపూర్, భీమిని గ్రామాలలో తిరిగి గ్రామస్థుల వద్ద మూడు క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంను తక్కువ ధరకు కొని కాగజ్ నగర్ లోని సామెల్ అనే వ్యక్తి కి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న విషయాన్ని అంగీకరించాడని తెలిపారు. పీడీఎస్ బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.