రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
హనుమకొండ,(విజయక్రాంతి): లైంగిక వేధింపులకు పాల్పడిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోంచా బీమల్ అకౌజం ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, ఇప్పటివరకు చర్య తీసుకోనందుకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. హనుమకొండ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి, బాధిత 11 మంది మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
లైంగిక వేధింపులు పాల్పడిన ఎంపీకి బాసటగా నిలుస్తున్నందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం అదాలత్ జంక్షన్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి అరుణ్య రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తులసి కళ్యాణి, సిరికొండ కవిత, బిజెపి నాయకులు కూతురు రాజు, శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.