బాధిత కుటుంబాలను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్

25-10-2026 | 03:00pm

మంథని, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్(Municipal Chairman Vodnala Srinivas), మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, ఎల్లంకి వంశీధర్‌లతో కలిసి వివిధ ప్రాంతాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య, బోయినిపేటకు చెందిన సౌల్ల లక్ష్మి, బేగంపేటకు చెందిన ముత్తే అరవింద్ కళ్యాణ్, అంబేద్కర్ నగర్‌కు చెందిన బూడిద శంకర్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని సూచించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంభోజు సమ్మయ్య, గౌతమేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గుండా రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు