జూలపల్లి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

01-10-2026 | 03:27pm

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన కాంగ్రెస్ నాయకులు

కమాన్‌పూర్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి) జూలపల్లి గ్రామ(Julapalli village) అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించేందుకు గ్రామ ఉపసర్పంచ్ గడ్డం రాజమహేందర్, కమాన్‌పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెబల్ రాజ్‌కుమార్ గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును (Minister Sridhar Babu ) కలిశారు.

ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అవసరమైన సదుపాయాలపై మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జూలపల్లి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

మరిన్ని వార్తలు