4 September, 2026 | 10:26 PM

Breaking News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •   అంజన్న భక్తులకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్   •   సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు   •  

ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

04-09-2026 | 08:08pm

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

సుల్తానాబాద్ లో వంటావార్పు

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): మాయమాటలతో అధికారం చేపట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వ  పాలనను  ప్రజలు ఎండగట్టాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు వైఫల్యంపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సదస్సు, వంటావార్పు కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి సర్కార్ మహిళా లోకానికి మహా మోసం చేసిందన్నారు.

మహిళల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, మేనిఫెస్టోలో పథకాలు ప్రకటించి అవి నెరవేర్చకపోవడం పట్ల మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారని అన్నారు, ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు వెయ్యి మూడు రోజులు అవుతున్న   హామీలునెరవేర్చలేదన్నారు, రానున్న ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు, ఈ సమావేశ నిర్వహణ విజయవంతం కు కృషి చేసిన పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి, మాజీ ఎంపిటిసి సుర శ్యాం తో పాటు వారికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు... ఈ కార్యక్రమం లో సుల్తానాబాద్ పట్టణంతోపాటు మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....