నిజామాబాద్ జిల్లాలో 21 మంది పోలీస్ అమరవీరులు

19-10-2026 | 06:55pm

1986 నుంచి జూలై 2026 వరకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది వివరాలు

బోధన్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): దేశ రక్షణ, ప్రజల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొంటున్నారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలో 1986 నుంచి జూలై 2026 వరకు మొత్తం 21 మంది పోలీసు అధికారులు, సిబ్బంది అమరులైనట్లు అందించిన జాబితా వెల్లడిస్తోంది. వివిధ హోదాల్లో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలు పోలీసు శాఖకు, సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

పోలీస్ అమరవీరుల వివరాలు

నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అందించిన జాబితాలోని అమరవీరుల పేర్లు, హోదాలు, బక్ల్ నంబర్లు ఈ విధంగా ఉన్నాయి.

ఎం. లింగారెడ్డి — సీఐ

బి. సోమరాజ్ — పీసీ నం. 677

సయ్యద్ సర్వర్ — హెచ్‌సీ నం. 632

ఏ. రామచంద్రర్ — పీసీ నం. 476

ఎం.డి. బషీరుద్దీన్ — పీసీ నం. 1114

ఎం.డి. గౌస్ — పీసీ నం. 661

బి. గణేష్ — పీసీ నం. 365

వి. నర్సయ్య — పీసీ నం. 637

ఎన్. అంజయ్య — పీసీ నం. 197

టి. రామ్ చందర్ రావ్ — ఏఎస్ఐ

చౌటి గంగాధర్ — పీసీ నం. 1500

ఎం.ఎ. గఫార్ — ఏఎస్ఐ

ఎన్. శంకర్ గౌడ్ — పీసీ నం. 1530

ఎం.డి. జహంగీర్ ఉద్దీన్ — ఏఆర్‌పీసీ నం. 1432

బాధవత్ గంగాధర్ — హెచ్‌జీ నం. 88

దొడ్ల సీతారామ్ — హెచ్‌జీ నం. 91

ఎం.ఎ. మోయిన్ — జూనియర్ కమాండో, నం. 113 (గ్రేహౌండ్స్)

ఈ. విక్టర్ — ఎస్‌ఐ

వడ్ల శ్రీధర్ — జూనియర్ కమాండో నం. 497

మాతారీ మొగులయ్య — జూనియర్ కమాండో నం. 1242

ఎంపల్లి ప్రమోద్ కుమార్ — పీసీ నం. 1923

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వారి త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు గౌరవం, అండదండలు అందించడం సమాజ బాధ్యతగా నిలుస్తుంది.

మరిన్ని వార్తలు