నడవలేని స్థితిలో జీవనం.. పెన్షన్ ఇప్పించండి
బోధన్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): సాలూర మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీకి(Sai Nagar Colony) చెందిన గుండ్ల రాజన్న నడవలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యం, శారీరక వైకల్యం(Physical disability) కారణంగా స్వయంగా నడవలేని పరిస్థితిలో ఉండటంతో రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఆసరా/వికలాంగుల పెన్షన్ మంజూరు కాలేదని రాజన్న తెలిపారు.
పెన్షన్ కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. తన పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతను నిర్ధారించి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని రాజన్న విజ్ఞప్తి చేశారు. పెన్షన్ మంజూరైతే తనకు నెలవారీ జీవన ఖర్చులు, మందులు తదితర అవసరాలకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.