16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి
నిర్మల్ అక్టోబర్ 23 ( విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ పరీక్షల విభాగ(Telangana Government Director Examinations Department) ఆధ్వర్యంలో మార్చ్ 20 27 లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు(Class 10 public examinations) హాజరయ్యే విద్యార్థుల ఫీజును(Student fees) 2026 నవంబర్ 16 లోపు చెల్లించాలని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న(Darshanam Bhojanna) తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 125 రూపాయల ఫీజు చెల్లించవలెనని, ఒకేషనల్ విద్యార్థులు దీనికి అదనంగా 60 రూపాయల ఫీజు చెల్లించలని చెప్పారు. ఈ ఫీజును ఐఎఫ్ఎస్సి పోర్టల్ సైబర్ ట్రెజరీ చాలన్(IFSC Portal Cyber Treasury Challan) ద్వారా చెల్లించవలెనని సూచించారు.
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్సైట్ ను ప్రధానోపాధ్యాయులు తమ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఫిజు మినహాయింపు కలదని తెలిపారు. ఫీజు చెల్లించిన పిదప జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు స్పెషల్ ఆఫీసర్లు ప్రిన్సిపాల్ లు 21 నవంబర్ 2026 లోపు విద్యార్థుల డాటాను ఆన్లైన్ లో డీఈవో కార్యాలయానికి పంపించవలెనని తెలియజేశారు. మరిన్ని వివరాలకు నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల అదనపు కమిషనర్ ముడారపు పరమేశ్వర్ ను సంప్రదించాలని తెలియజేశారు.