ప్రమాదకరంగా పెగ్జీలు
17-10-2026 | 07:39pm
నిర్మల్, అక్టోబర్ 17 ( విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో(Nirmal town) వ్యాపార దుకాణాలతో పాటు ప్రైవేటు నిర్వాకులు(Private operators) మున్సిపల్ అనుమతి లేకుండా ఫ్లెక్సీలను(Flex banners) ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని రోడ్లు కూడళ్ల వద్ద పెద్ద పెద్ద పెగ్జీలు ఆకర్షణీయమైన రంగులతో ఏర్పాటు చేయడంతో వాహనదారులు ముందుగా వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ప్రచారంతో కూడిన పెగ్జీలు కట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య(Traffic problem) కూడా ఏర్పడుతుందని వెంటనే పోలీసు అధికారులు మున్సిపల్ అధికారులు(Municipal officials) చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.