1న చలో ఢిల్లీని విజయవంతం
నిర్మల్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఓటు బచావో.. దేశ్ బచావో నినాదంతో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్మల్(Nirmal) నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్న పరిశీలించారు.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్, మాజీ ఏఎంసీ చైర్మన్ దశరథ రాజేశ్వర్, నాయకులు నాందేడపు చిన్ను, ఓస రాజేశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేణు, సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.