వైద్య ఉద్యోగుల నిరసన

02-10-2026 | 07:11pm

నిర్మల్ అక్టోబర్ 2 ( విజయ క్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల(NHM Employees Protest) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు గురువారం తెలిపారు. పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఉద్యోగులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని పిఆర్సి ని అమలు చేయాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు రమణ జేఏసీ నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు