అటవీ శాఖ ఉద్యోగుల మోటార్ సైకిల్ ర్యాలీ

02-10-2026 | 08:07pm

నిర్మల్ అక్టోబర్ 2 ( విజయ క్రాంతి): అటవీ శాఖ(Forest Department) ఆధ్వర్యంలో 72వ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ , ఖానాపూర్ భైంసా సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మొన్న పాములను సంరక్షిద్దాం, అటవీ సంపదను పెంపొందించుకుందాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అధికారి నాగిని భాను అటవీ మండలాధికారి నిర్మల్, రామకృష్ణ ఎఫ్ఆర్ఓ నిర్మల్, శ్రీనివాసరావు FRO దిమ్మదుర్తి, రాథోడ్ రమేష్ ఎఫ్ ఆర్ ఓ  భైంసా, నజీర్ ఖాన్ డిఆర్ఓ మరియు డివిజనల్ అటవీ సిబ్బంది  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు