బండమీదిపల్లిలో గాంధీ జయంతి వేడుకలు
"గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం"
జడ్చర్ల, అక్టోబర్ 02: గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అనే మహాత్మా గాంధీ ఆలోచన గ్రామ పాలనకు మార్గదర్శకమని బండమీదిపల్లి గ్రామ సర్పంచ్ సత్యమోల పాండు(Bandameedipally village sarpanch Satyamoala Pandu) అన్నారు.ఈరోజు బండమీదిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.ఈ సభలో గ్రామానికి ప్రథమ పౌరుడిగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడమే తన బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్యం అంటే కేవలం అభివృద్ధి పనులు మాత్రమే కాదు, ప్రజలను భాగస్వాములుగా చేసుకుని పారదర్శకంగా పాలన అందించడమని తెలిపారు.అనంతరం విబి -జీ రామ్ జీ , జీపీడీపీ ప్రణాళిక, తాగునీటి సమస్య, పారిశుధ్యం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయ సమస్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ సర్పంచ్ సత్యమోల పాండు, ఉప సర్పంచ్ దోర్వి నాగలక్ష్మి మల్లేష్, పంచాయతీ కార్యదర్శి పార్వతమ్మ మేడం, ఎవో అగ్రికల్చర్ నరసింహులు, సార్ ఫీల్డ్ ఆఫీసర్ జీవన్ వార్డు సభ్యులు కొత్తోల చిన్న పెంటయ్య,దొర్వి రమేష్, చిట్యాల మహేష్,చిట్యాల సురేష్,కారకొండ చంద్రకళ, కానుగు బాయ్ ఉమా పెద్ద పెద్దమౌని శివ, గ్రామ పెద్దలు యువకులు,మహిళలు యూత్ తదితరులు పాల్గొన్నారు