ప్రజా భద్రతే లక్ష్యం
ఖానాపూర్ సిఐ సత్యనారాయణ
ఖానాపూర్ (విజయక్రాంతి ) : ప్రజల శాంతి భద్రతలే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలని ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ(Khanapur Circle Inspector Satyanarayana) అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ కళాశాల ఆవరణలో పోలీసులు వీక్లీ పరేడ్(Police Weekly Parade) నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పోలీస్ విధులు బాధ్యతతో కూడుకున్నవని, ప్రజల భద్రతకు నిరంతరం అందుబాటులో ఉండాలంటే సిబ్బంది శారీరకంగా దృఢంగా, విధుల పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. సిబ్బంది తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు .కార్యక్రమంలో ఖానాపూర్ సర్కిల్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.