ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

02-10-2026 | 07:39pm

నిర్మల్, అక్టోబర్ 2( విజయ క్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam Aadmi Party (AAP) )ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీ పార్క్‌లో  మహాత్మా గాంధీ విగ్రహానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ పార్టీ నేతలుపూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, స్పోక్స్‌పర్సన్ వసంత్ రావు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు