శివపార్వతుల కల్యాణం
22-09-2026 | 07:06pm
బూర్గంపాడు, (విజయక్రాంతి): మండలంలోని తాళ్లగొమ్మూరు గ్రామపంచాయతీ మహాలక్ష్మమ్మ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో(Ganapati Navaratri celebrations) భాగంగా టీమ్ త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవాయిద్యాలు,వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.