నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్
04-09-2026 | 10:06pm
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా అచ్చంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధిస్తున్న బి సమత, బంజపల్లి ప్రాథమిక పాఠశాల(Banjapalli Primary School)లో ఎస్జీటీగా పనిచేస్తున్న అజయ్ కుమార్ లను ఎంపిక చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి(Mandal Education Officer Tirupati Reddy) తెలిపారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించినందుకు గాను వీరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు.






