సుప్రీంకోర్టు కన్నెర్ర

28-09-2026 | 12:53pm

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు NCR పరిధిలో వరుసగా వెలుగుచూస్తున్న అత్యాచార, లైంగిక దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు(Supreme Court) దృష్టి సారించింది. ఇటీవల నమోదైన పలు కేసులను కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణకు సిద్ధమైంది.

జస్టిస్ జేబీ పర్దీవాలా(Justice JB Pardiwala), జస్టిస్ కే. వినోద్ చంద్రన్(Justice K Vinod Chandran) నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. సుమోటో పిల్‌ను రిజిస్టర్ చేసి విచారణకు లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీ-NCRలో మహిళలు, మైనర్లపై జరిగిన లైంగిక దాడుల కేసులు ఈ విచారణకు కారణంగా నిలిచాయి. ముఖ్యంగా పార్కులు, రహదారులు, బస్సులు వంటి ప్రజా ప్రదేశాలు అధిక ప్రమాద ప్రాంతాలుగా మారకూడదని కోర్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి: పుట్టిన బిడ్డ చేతికి బంగారు ఉంగరం

కోర్టు ముందు వచ్చిన ఘటనల్లో ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోని పార్కులో జరిగిన గ్యాంగ్‌రేప్ ఆరోపణతో పాటు, కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్‌పై(Delhi women safety) జరిగిన లైంగిక దాడి కేసు కూడా ఉన్నాయి. ఈ ఘటనలు 2012 నాటి నిర్భయ కేసును గుర్తుచేస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. ప్రజా ప్రదేశాల్లో భద్రత, పోలీసింగ్, పర్యవేక్షణ, లైటింగ్ వంటి అంశాలపై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసుల విచారణలో ఢిల్లీ పోలీసుల నుంచి వివరాలు కోరినట్లు రిపోర్టులు వెల్లడించాయి.


మరిన్ని వార్తలు