యూపీఐ ఛార్జీలపై 'సుప్రీం' సంచలన నిర్ణయం

28-09-2026 | 01:23pm

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న UPI పేమెంట్స్‌పై ప్రతిపాదించిన Merchant Discount Rate (MDR) వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కొత్త MDR విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు(Supreme Court), ప్రస్తుత దశలో మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కొత్త విధానం ప్రకారం రూ. 2,000కు మించిన నిర్దిష్ట UPI merchant transactionsపై MDR వర్తించనుంది. ఈ విధానం అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఇది అన్ని UPI లావాదేవీలకు వర్తించదు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం Person-to-Person (P2P) లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. అలాగే రూ.2,000 వరకు ఉన్న అనేక merchant transactions కూడా ఛార్జీల పరిధిలోకి రావు.

సుప్రీంకోర్టు ముందు ప్రధానంగా MDR విధానానికి చట్టపరమైన ఆధారం ఏమిటి, ఛార్జీలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారు. కొత్త విధానం ఎలా అమలు కానుంది అనే అంశాలు చర్చకు వచ్చాయి. ఈ వివరాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కేసులో తదుపరి విచారణలో కేంద్రం సమర్పించే అఫిడవిట్ కీలకంగా మారనుంది. దీంతో UPI MDR విధానం కొనసాగుతుందా? దాని అమలులో మార్పులు వస్తాయా? అనే అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఇప్పటికే UPI MDRను వినియోగదారులపై నేరుగా విధించే ఛార్జీ కాదని స్పష్టం చేసింది. అలాగే కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో సుమారు 96 శాతం merchant UPI transactions ప్రభావితం కాకుండా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని వార్తలు