సీఈసీకి కాక!

25-09-2026 | 05:35am
  1. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
  2. మాకూ సమయం వస్తుంది, విడిచిపెట్టం..
  3. ఎన్నికల సంఘానికి రాహుల్‌గాంధీ హెచ్చరికలు
  4. ఇందిరాగాంధీ ఓడిపోయారు, బీజేపీ ఎందుకు ఓడటం లేదు?
  5. ప్రజా వ్యతిరేకత మాయమవుతన్నదేం? 
  6. అన్ని ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ నేత ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురువారం పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్(CEC Gyanesh Kumar) నియామకం, ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలో మార్పులపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.

దేశంలో ఓటు హక్కును దొంగిలిస్తున్నారని, ఇది ఓటుపై దాడి మాత్రమే కాదని.. ప్రతీ భారతీయుడి ప్రజాస్వామ్య భావప్రకటనా హక్కుపై దాడి, దేశ రాజ్యాంగంపై దాడి అని మండిపడ్డారు. దేశంలో ఇటీవల అన్ని ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ అన్నారు. తాను గత మూడేళ్లుగా ఈ విషయం చెబుతున్నానని, తన వాదనలకు మద్దతుగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణా టక నుంచి ఆధారాలను ఉదహరించానని అన్నారు. ఓట్ల చోరీ మాత్రమే కాదు, చట్టాల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ జరిగిందన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ఆయన పరిరక్షకులు కాపాడుతున్నారని చెప్పారు.

సీఈసీ తక్ష ణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఇతర కమిషనర్లు చేసిన ఆరోపణలపై రాజకీయంగా పెను దుమారం రేగుతున్న వేళ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికైనా జ్ఞానవంతుడైన జ్ఞానేష్ కుమార్ దేశప్రయోజనాల కోసం అప్రూవర్‌గా మారాలని అ న్నారు.

ప్రజాస్వామ్య దేశాల్లో, దీర్ఘకాలం పాటు అధికారంలో ఉండే ప్రభుత్వాలపై ప్ర జా వ్యతిరేకత సహజమని రాహుల్ చెప్పా రు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో విజయం సాధించినప్పుడు ఇందిరాగాంధీ ప్రజాదరణ శిఖర స్థాయికి చేరిందని, కానీ ఒకటి రెండు ఏళ్లలోనే ఇందిర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలకు ఇలా జరిగితే, నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీలకు ఎం దుకు జరగడం లేదని ప్రశ్నించారు.

ఒక వ్యక్తి ప్రజాదరణను లేదా ప్రభుత్వ పనితీరును తాను అర్థం చేసుకోగలనని, కానీ ప్రభుత్వ వ్యతిరేక అకస్మత్తుగా ఎలా మాయమైందో అర్థం చేసుకోవడం కష్టమేనని అన్నారు. ఓటు హక్కు రాజ్యాంగానికి అధికారాన్ని ఇ స్తుంది, రాజ్యాంగం నుంచే చట్టాలు రూపొందుతాయి, చట్టసభల సభ్యులు ఓట్ల ద్వారానే ఎన్నికవుతారని రాహుల్ చెప్పారు. ఓటింగ్‌ను రద్దు చేస్తే రాజ్యాంగం అర్థరహితం అవుతుందని అన్నారు. అప్పుడు రాజ్యాంగ సంస్థలన్నీ ప్రశ్నార్థకంగా మారుతాయని అన్నారు. దేశంలో ఓటు దొంగతనం, ఓటు ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నది తప్పని, ‘సమయం వస్తుంది.. మిమ్మల్ని వద లం’ అని రాహుల్ హెచ్చరించారు.

2024 ఎన్నికలు రిగ్గింగ్..

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కు మార్‌ను ఎలా నియమించారని ప్రశ్నించా రు. ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక ప్ర క్రియ కార్యనిర్వహక ప్రభావం నుంచి దూ రంగా ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు.  ఈ ప్రక్రియ సరిగా లేదని, స్వతంత్రంగా లేదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యంపై ఇలా దాడి జరగలేదని, 2024 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.దేశంలో ప్రస్తుతం ఓట్ల చోరీ నుంచి చట్టాల చోరీ చేసే వరకు పరిస్ధితి దిగజారిందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

తమకు నచ్చిన ఎన్నికల కమిషనర్లను నియమించుకునేందుకు కేంద్రం పార్లమెంట్‌లో నల్ల చట్టాలు చేసిందని, వాటి ద్వారా సీఈసీ అయిన జ్ఞానేష్‌కుమార్ ఇప్పు డు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార ని రా హుల్ విమర్శించారు. ఎస్‌ఐఆర్ సహా తా జాగా బయటపడిన అక్రమాలకు కారణమైన జ్ఞానేష్‌కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్‌గాంధీ డిమాం డ్ చేశారు. ఓటును దొంగిలించినట్లయితే, ఓటు దొంగతనం ద్వారా పార్లమెం టుకు ఎన్నికైన చట్టసభ సభ్యులు చేసిన ఏ చట్టమై నా, ఏ సంస్థాగత మార్పు అయినా కూడా చట్టవిరుద్ధమే అని తేల్చిచెప్పారు. ఈ గందరగోళానికి జ్ఞానేష్ కుమార్ బాధ్యుడని, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దీనిపై ఆయనను తప్పుబట్టారని తెలిపారు. ఓటు మన దేశానికి పునాది అని, మన ఓటును నాశనం చేశారని ఆరోపించారు.  

దేశ ద్రోహులు-..

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ‘దేశద్రోహులు’ అని  రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశానికి వారు చేసిన ద్రోహానికి మోదీ, అమిత్ షాపై విచారణ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఓటు చోరీ ద్వారా ఎన్నికైన ఎంపీలు చేసే చట్టాలు అక్రమమని రాహుల్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియనే దొంగిలిస్తున్న మోదీ, అమిత్ షాపై విచారణ జరగాలని, ప్రజాస్వామ్యం ధ్వంసం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు.

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపి క ప్రక్రియ ప్రభుత్వ నియంత్రణకు అతీతంగా ఉండాలని తాను చేసిన సూచనను మోదీ సర్కార్ బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు.  దేశంలో అధికార వ్యతిరేకత అనే ఒక ప్రాథమిక శక్తి ఉంటుందని, అది తిరగబడటం మొదలుపెడితే ఎవరినీ వదిలిపెట్టద ని స్పష్టం చేశారు. పది నెలల వ్యవధిలో సీ ఈసీ నిర్ణయాలపై తాము కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషి జా తీయ మీడియా ఓ కథనంలో పేర్కొన్నది.

మరిన్ని వార్తలు