చైనాతో ఒమన్ దోస్తీ
చైనాతో ఒమన్ కీలక ఒప్పందాలు.. జిన్‌పింగ్–సుల్తాన్ భేటీ!
బీజింగ్: చైనా, ఒమన్ దేశాల మధ్య(China and Oman Sign Key Agreements) ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ చైనా పర్యటనలో భాగంగా సోమవారం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందాల అనంతరం ఇరువురు నేతలు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పర్యటనలో భాగంగా మొత్తం ఒక Agreement, 14 Memorandums of Understanding (MoUs), ఒక Cooperation Protocolపై సంతకాలు జరిగాయి. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించడమే ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యం.
AI, Digital Economy రంగాల్లో సహకారం
Artificial Intelligence (AI), Space Technology, Digital Economy, Data Management, Satellite Navigation, Green Development వంటి కీలక రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. అలాగే పరిశ్రమలు, Supply Chains, Investment, Science and Technology, Media రంగాల్లోనూ భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు నిర్ణయించాయి. ఆర్థిక రంగంలోనూ కీలక అడుగు పడింది. ఒమన్ సెంట్రల్ బ్యాంక్, చైనా పీపుల్స్ బ్యాంక్ మధ్య Local Currency Swap Agreement కుదిరింది. దీనివల్ల రెండు దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు, Financial Cooperation మరింత సులభతరం కానున్నాయి.
మధ్యప్రాచ్యంపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
ఈ సమావేశంలో ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ పరిణామాలపైనా చర్చ జరిగింది. మధ్యప్రాచ్యం, గల్ఫ్ ప్రాంతం అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు వేదిక కాకూడదని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. వివాదాలను చర్చలు, శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఒమన్ సుల్తాన్ హైతమ్ కూడా స్పష్టం చేశారు. 2025లో చైనా–ఒమన్ మధ్య వాణిజ్య లావాదేవీలు సుమారు 9.6 బిలియన్ ఒమానీ రియాళ్లకు చేరాయి. చైనా ఒమన్‌కు అతిపెద్ద Trade Partnerగా కొనసాగుతోంది. తాజా ఒప్పందాలతో ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, టెక్నాలజీ సంబంధాలు మరింత విస్తరించే అవకాశముంది.