హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు!
02-11-2026 | 12:37pm
హైదరాబాద్: నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) అమలు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు అబిడ్స్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఆంక్షల కారణంగా హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల(RTC buses) రూట్లలోనూ మార్పులు చేయనున్నారు. ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు.