సుల్తానాబాద్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
03-11-2026 | 01:05am
సుల్తానాబాద్ నవంబర్ 02 (విజయ క్రాంతి): ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు(MLA Chintakunta Vijaya Ramana Rao) ఆదేశాల మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నీ యాదవనగర్ అంగన్‌వాడీ పాఠశాలలో 7వ వార్డు కౌన్సిలర్ ఉట్ల వర ప్రదీప్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు మరియు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ్ పలువురు పాల్గొన్నారు..