ప్రజావాణి అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
జనగామ,(విజయక్రాంతి): ప్రజావాణి అర్జీలకు(Prajavani Petitions) అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ బెన్షాలోం(Additional Collector Ben Shalom)తో కలిసి ప్రజావాణిలో 221 దరఖాస్తులు స్వీకరించారు. పెండింగ్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
నిడిగొండకు చెందిన నారాయణమ్మ తన భూమి విరాసత్ కోసం ఇప్పగూడెంకు చెందిన ధర్మారెడ్డి అక్రమ పట్టాల రద్దు కోసం, కూనూరు రైతులు ఆకేరు చెక్ డ్యాం నుంచి అక్రమ మోటార్ల తొలగింపు కోసం వావిలాలకు చెందిన మహేందర్ చింత చెట్టు కొమ్మల తొలగింపు కోసం,శాతాపురంకు చెందిన వెంకటేష్ పహాణీ నమోదు కోసం అర్జీలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చినకోట్యా నాయక్, ఎస్ఈ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.