ఓటు చోరీపై ఢిల్లీ గడ్డపై బీర్ల అయిలయ్య గర్జన

02-11-2026 | 03:36pm

ఆలేరు, నవంబర్ 2 (విజయక్రాంతి): దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడేందుకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘ఓట్ చోర్ – దేశ్ బచావో’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. తెలంగాణ భవన్ నుంచి నిర్వహించిన భారీ ర్యాలీ (Rally)లో పాల్గొన్న ఆయన, అనంతరం రాంలీలా మైదానంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఆలేరు నియోజకవర్గం నుంచి సుమారు 99 మంది కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆయనతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, రాజ్యాంగం కల్పించిన హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఓటు చోరీ ఆరోపణలపై సమగ్ర విచారణ (Investigation) జరిపి ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత (Transparency) తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆలేరు కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం పోరాటంలో ముందుంటాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు